AP Badvel by-election: ఏపీ బద్వేలు ఉప ఎన్నికల బరిలో 11మంది అభ్యర్థులు

AP Badvel by-election: ఏపీ బద్వేలు ఉప ఎన్నికల బరిలో 11మంది అభ్యర్థులు
X
AP Badvel by-election: ఇప్పటివరకు 11మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

AP Badvel by-election: కడపజిల్లా బద్వేలు ఉప ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మరికాసేపట్లో ముగియనుంది. ఇప్పటివరకు 11మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఉప ఎన్నిక పోటీకి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన దూరంగా ఉండగా.... అధికార వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి.

వైసీపీ తరపున దాసరి సుధ, కాంగ్రెస్‌ తరపున కమలమ్మ, బీజేపీ తరపున పంతల సురేష్‌ నామినేషన్లు దాఖలు చేశారు. ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ల నుంచి రమో 8 మంది నామినేషన్లు వేశారు. గత మార్చిలో అనారోగ్యంతో ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతి చెండంతో బద్వేలుకు ఉప ఎన్నికలు వచ్చాయి. వెంకట సుబ్బయ్య భార్య, ప్రముఖ గైనకాలజిస్టు దాసరి సుధను తమ అభ్యర్థిగా అధికార పార్టీ నిలబెట్టింది.

Tags

Next Story