బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హౌస్‌ అరెస్ట్‌

బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హౌస్‌ అరెస్ట్‌

అంతర్వేదిలో ఆగ్రహ జ్వాలలు చల్లారడం లేదు..ఆందోళను మరింత తీవ్రమవుతున్నాయి.. బుధవారం అంతర్వేది పర్యటనకు బీజేపీ నేతలు పిలుపు ఇచ్చారు. దీంతో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా బీజేపీ నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు పోలీసులు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సహా, ఇతర నేతలను హౌస్‌ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు..

అంతర్వేదిలో రథం దగ్ధం వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. 4 రోజులైనా ఏం జరిగిందో ఎందుకు తేల్చలేకపోవడం లేదంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. బాధ్యులను కఠినంగా శిక్షించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story