విజయవాడలో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు హౌస్ అరెస్ట్

విజయవాడలో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.. శుక్రవారం ఛలో అమలాపురానికి సోమువీర్రాజు పిలుపు ఇచ్చారు.. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా సోము వీర్రాజును గృహ నిర్బంధం చేశారు.. ప్రస్తుతం అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పోలీసులు ఆంక్షలు ఉన్నాయి.. అంతర్వేది ఇష్యూతో 30, 144 సెక్షన్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ముందుగానే సోము వీర్రాజును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
Next Story