Ap Budget 2021-22 : ఏపీ బడ్జెట్‌ రూ.2,29,779 కోట్లు

Ap Budget 2021-22 : ఏపీ బడ్జెట్‌ రూ.2,29,779 కోట్లు
Ap Budget 2021-22 : ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశం కొనసాగుతోంది. ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.

Ap Budget 2021-22 : ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశం కొనసాగుతోంది. ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2021-22 ఏడాదికి రూ. 2,29,779.27 కోట్ల అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో చిన్నారుల కోసం రూ. 16,748కోట్లు, మహిళల అభివృద్ధికి రూ. 47,283.21కోట్లు, బీసీ సబ్ ప్లాన్ కి రూ. 28.237కోట్లు, కాపు సంక్షేమానికి రూ. 3,360 కోట్లు, రాష్ట్రంలో కొవిడ్‌ నియంత్రణ చర్యల కోసం రూ.1000కోట్ల కేటాయించారు.

కేటాయింపులు ఇలా..

ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు

కాపుల సంక్షేమం కోసం 3,306 కోట్లు

బ్రహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు

ఎస్సీ సబ్‌ ప్లాన్‌కు రూ.17,403 కోట్లు

ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు రూ. 6,131 కోట్లు

మైనార్టీ యాక్షన్‌ ప్లాన్‌ కింద రూ.3,840.72 కోట్లు

మైనార్టీ సబ్‌ ప్లాన్‌ రూ.1,756కోట్లు

చిన్నారుల కోసం రూ. 16,748 కోట్లు

మహిళాభివృద్ధికి రూ. 47, 283 కోట్లు

వ్యవసాయ పథకాలకు రూ.11,210 కోట్లు

విద్యా పథకాలకు రూ. 24,624 కోట్లు

ఆరోగ్య రంగానికి రూ.13,830 కోట్లు

విద్యుత్‌ రంగానికి రూ.6,637 కోట్లు

కొవిడ్‌పై పోరాటానికి రూ.1000 కోట్లు

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకకు రూ.17,000కోట్లు

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు 8,727 కోట్లు

రోడ్లు భవనాల శాఖకు రూ. 7,594 కోట్లు

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణకు రూ.1,556 కోట్లు

వైఎస్సార్‌ రైతు భరోసా రూ.3,845 కోట్లు

జగనన్న విద్యా దీవెన రూ.2,500కోట్లు

జగనన్న వసతి దీవెన రూ.2,223.15 కోట్లు

పీఎం ఫసల్‌ బీమా యోజనకు రూ.1,802 కోట్లు

డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.865కోట్లు

జగనన్న చేదోడుకు రూ.300కోట్లు

వైఎస్సార్‌ వాహనమిత్రకు రూ.285కోట్లు

వైఎస్సార్‌ మత్స్యకార భరోసాకు రూ.120 కోట్లు

అర్చకుల ప్రోత్సాహకాలకు రూ .120కోట్లు

ఇమామ్స్‌, మౌజంల ప్రోత్సాహకాలకు రూ.80కోట్లు

పాస్టర్ల ప్రోత్సాహకాలకు రూ.40కోట్లు

ల్యాండ్ రీ సర్వే కోసం రూ.206 కోట్ల

Tags

Read MoreRead Less
Next Story