విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఏపీలో రాష్ట్రవ్యాప్త బంద్

విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఏపీలో రాష్ట్రవ్యాప్త బంద్
విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త బంద్ కొనసాగుతోంది. టీడీపీ, వామపక్షాలుబంద్‌కు మద్దతు తెలిపాయి.

విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఏపీలో రాష్ట్రవ్యాప్త బంద్ కొనసాగుతోంది. రాష్ట్ర నినాదం కేంద్రానికి అర్ధమయ్యేలా బంద్ నిర్వహించాలంటూ ఉక్కు పోరాట కమిటీ పిలుపునిచ్చింది. టీడీపీ, వామపక్షాలు ఏపీ బంద్‌కు మద్దతు తెలిపాయి. ఆర్టీసీ యూనియన్లు సైతం బంద్‌కు మద్దతుగా నిలిచాయి. బంద్ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి.

విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్‌ వద్ద విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనే నినాదంతో టీడీపీ నేతలు, వామపక్షాలు నిరసనలు తెలుపుతున్నాయి. మరోవైపు ఆర్టీసీ బస్టాండ్లు, డిపోల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి బస్సులు రోడ్డెక్కనున్నాయని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం తరువాత నల్లబ్యాడ్జీలు ధరించి బస్సులు నడుపుతామని ఆర్టీసీ సిబ్బంది తెలిపారు. బంద్ నేపథ్యంలో కళాశాలలు, వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు.


Tags

Next Story