Home
 / 
ఆంధ్రప్రదేశ్ / ఇవాళ ఏపీ కేబినెట్...

ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి రైతుల దీక్షా శిబిరంపై ఆంక్షలు

ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ సమావేశం సందర్భంగా అమరావతి రైతుల దీక్షా శిబిరంపై ఆంక్షలు విధించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక పాలసీ, అసెంబ్లీ సమవేశాల..

ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి రైతుల దీక్షా శిబిరంపై ఆంక్షలు
X

ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ సమావేశం సందర్భంగా అమరావతి రైతుల దీక్షా శిబిరంపై ఆంక్షలు విధించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక పాలసీ, అసెంబ్లీ సమవేశాల నిర్వహణ సహా పలు అంశాలపై చర్చించేందుకు ఇవాళ మంత్రిమండలి సమావేశం జరగనుంది. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి సీఎం సచివాలయానికి వెళ్తారు. ఈ నేపథ్యంలో ఈ దారిలో పోలీసులు ఆంక్షలు విధించారు. రైతులు ఇవాళ శిబిరాలకు రావొద్దంటూ రాత్రే వాళ్లను ఆదేశించారు. దీనిపై రైతులు, మహిళలు, రైతు కూలీలు మండిపడుతున్నారు.

3 రాజధానుల శిబిరంలో వాళ్లకు లేని ఆంక్షలు తమకెందుకంటూ వారు ప్రశ్నిస్తున్నారు. 3 రాజధానుల శిబిరానికి అనుమతి ఇచ్చి.. తమను అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి మందడంలో ఉన్న 3 రాజధానుల దీక్షా శిబిరం దాటుకుని తర్వాత అమరావతి దీక్షా శిబిరం మీదుగానే ఆయన CM సచివాలయానికి వస్తారు. అక్కడ లేని ఆంక్షలు తమ దీక్షా శిబిరాలకు ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు.

  • By kasi
  • 5 Nov 2020 3:12 AM GMT
Next Story