CM Chandrababu: నేడు ముంబైకి సీఎం చంద్రబాబు నాయుడు..

CM Chandrababu: నేడు ముంబైకి సీఎం చంద్రబాబు నాయుడు..
X
మహారాష్ట్ర సీఎం దేవేంద్రఫడ్నవీస్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు..అక్కడి నుంచి నేరుగా విశాఖకు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు విశాఖపట్నం రానున్నారు.. ఈ రోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్రఫడ్నవీస్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు.. ముంబైలోని ఆజాద్ గ్రౌండ్స్ లో సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న దేవేంద్ర ఫడ్నవీస్.. మహారాష్ట్ర సీఎంగా మూడో సారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఫడ్నవీస్.. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్డీఏ నేతలు హాజరుకానున్నారు.. అయితే, ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముంబై వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఇక, ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ముంబై నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకుంటారు చంద్రబాబు నాయుడు..

మధ్యాహ్నం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయల్దేరి.. ముంబై చేరుకున్నారు సీఎం చంద్రబాబు.. అక్కడ దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు.. ఇక, తిరిగి ముంబై నుంచి రాత్రి 7.30 గంటలకు విమానంలో బయల్దేరనున్న ఆయన.. రాత్రి 9.30 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాత్రి 10.05 గంటలకు ఎన్టీఆర్‌ భవన్‌కు చేరుకొని బస చేయనున్నారు.. ఇక, రేపు జరగనున్న డీప్ టెక్నాలజీ సమ్మిట్ 2024కు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు సీఎం చంద్రబాబు.. సదస్సు తర్వాత విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..

Tags

Next Story