AP CM Delhi Tour: ఏపీ సీఎం ఢిల్లీ టూర్.. మోదీ, అమిత్‌షాతో మంతనాలు..

AP CM Delhi Tour: సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. నిన్న మోదీతో భేటీ అయిన జగన్.. ఇవాళ అమిత్‌షాతో సమావేశం కానున్నారు. నిన్నటి భేటీలో రాష్ట్ర విభజనతో ఏర్పడ్డ రెవెన్యూ లోటు బకాయిలు, పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు, ఈ ప్రాజెక్టు కింద సహాయ, పునరావాస పనులు చేపట్టడానికి నిధులు కలిపి కేంద్రం నుంచి ఏపీ 46 వేల కోట్లు ఇప్పించాలని ప్రధానికి జగన్ విజ్ఞప్తి చేశారు.
విభజన సమస్యలు, 2014-15 నాటి రెవెన్యూ లోటు భర్తీ, పోలవరం నిర్మాణపరమైన అంశాలు, తెలంగాణ డిస్కంల నుంచి బకాయిలు, ఆహారభద్రత చట్టం కింద అదనపు ధాన్యాల కేటాయింపు, ప్రత్యేక హోదా, కొత్త జిల్లాలకు వైద్య కళాశాలల కేటాయింపు, విశాఖపట్నానికి మెట్రో రైల్, కడప ఉక్కు పరిశ్రమలకు గనుల కేటాయింపు అంశాలను సీఎం ఈ సమావేశంలో ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు సీఎంఓ తెలిపింది. అయితే ఇందులో విశాఖకు మెట్రో రైలు అంశం తప్ప మిగిలినవన్నీ గత పర్యటనల సమయంలో ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన సమస్యలే మళ్లీ ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఏపీ జగన్.
ఇక ఇవాళ హోం మంత్రి అమిత్ షాతో నేడు సీఎం జగన్ భేటీ కానున్నారు.. కీలక అంశాలపైనే చర్చ జరిపే అవకాశం ఉందని ఏపీ సీఎంఓ తెలిపింది. నిన్న రాత్రి 10 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కావాల్సి ఉన్నా వాయిదా పడింది. కాసేపట్లో హోం మంత్రితో సమావేశం కానున్నారు. కాగా, ఈ సమావేశంలో ఏపీ అభివృద్ధితోపాటు పలు విషయాలపై చర్చించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com