YCP : ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది : జగన్

YCP : సామాజిక న్యాయంలో భాగంగా NDA అభ్యర్ధి ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ సీఎం జగన్. మంగళగిరిలోని కన్వెన్షన్ సెంటర్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ద్రౌపది ముర్ము సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారిని పరిచయం చేశారు సీఎం. ద్రౌపది ముర్ముకు వైసీపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు జగన్ తెలిపారు.
వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల మద్దతు కోరారు ద్రౌపది ముర్ము. వారసత్వ కట్టడాలకు ఆంధ్రప్రదేశ్ నిలయమని.. ఆంధ్రప్రదేశ్‌కు ఘనమైన చరిత్ర ఉందన్నారామె. ఎందరో మహనీయులు తెలుగు గడ్డపై జన్మించారన్నారు. తెలుగు కవులైన నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడలను ముర్ము స్మరించుకున్నారు. తిరుపతి, లేపాక్షి వంటి ప్రసిద్ధ క్షేత్రాలకు ఏపీ నిలయమని.. స్వాతంత్ర్య సమరంలో ఏపీకి ఘన చర్రిత ఉందన్నారు. ఈ పోరాటంలో రాష్ట్ర మహనీయులు కీలక ప్రాత పోషించారని చెప్పారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com