ఏపీలో ఆగని కరోనా విజృంభణ.. గత 24 గంటల్లో చూస్తే..

X
ఏపీలో కరోనా విజృంభణ ఆగడంలేదు.. గత 24 గంటల్లో 72,838 శాంపిల్స్ ని పరీక్షించగా 7,228 మంది కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కోవిడ్ వల్ల చిత్తూర్ లో ఏడుగురు, ప్రకాశం లో ఏడుగురు, కృష్ణ లో ఐదుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, విశాఖపట్నం లో నలుగురు, పశ్చిమ గోదావరి లో నలుగురు, అనంతపూర్ లో ముగ్గురు, కడప లో ముగ్గురు, నెల్లూరు లో ముగ్గురు, గుంటూరు లో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు , శ్రీకాకుళం లో ఒక్కరు మరణించారు. గడచిన 24 గంటల్లో 8,291 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 6,43,635 పాజిటివ్ కేసులకు గాను 5,67,772 మంది డిశ్చార్జ్ కాగా.. 5,506 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 70,357 గా ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
