ఏపీలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో కేసులు చూస్తే..

ఏపీలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో కేసులు చూస్తే..

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 79,990 శాంపిల్స్‌ ని పరీక్షించగా 7,293 మందికి కోవిడ్-19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. కోవిడ్‌ వల్ల ప్రకాశం లో పది మంది, చిత్తూరులో ఎనిమిది మంది, కడప లో ఎనిమిది మంది, కృష్ణలో ఆరుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, తూర్పు గోదావరి లో నలుగురు, పశ్చిమ గోదావరిలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, అనంతపూర్‌ లో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, కర్నూల్‌ లో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు మరణించారు.. గడచిన 24 గంటల్లో 9,125 మంది కోవిడ్‌ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 6,65,856 పాజిటివ్ కేసులకు గాను 5,94,399 మంది డిశ్చార్జ్ కాగా.. 5,663 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 65,794 గా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story