ప్రజలే జగన్ పై దాడి చేసేరోజు రాబోతోంది : ఏపీ డిప్యూటీ సీఎం

అవకాశం దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రి జగన్‌కి వీరవిధేయత చూపించేందుకు ప్రయత్నించే డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. అదే సీఎం జగన్‌పై ఘాటైన విమర్శలు చేశారు. తాను ఎవర్ని తిడుతున్నారో, అసలు ఎవర్ని తిట్టాలనుకున్నారో కూడా మర్చిపోయి చెలరేగిపోయారు. జగన్‌పై ప్రజలు తిరుగుబాటు చేసే రోజు త్వరలో వస్తుందని చెప్పుకొచ్చారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పవన్ వివాదంపై స్పందించబోయారు. తడబడ్డారు. ఏకంగా జగన్‌పైనే జనం తిరుగుబాటు చేస్తారని ఒకటికి రెండుసార్లు అన్నారు. ఆ తర్వాత కూడా పవన్‌కి, జగన్‌కు తేడా ఆయన స్ఫృహలోకి రాలేదు. పవన్ కల్యాణ్‌ను పార్టీలో చేరాలని ఏర్పాట్లు చేస్తే.. అవసరం లేదు, ప్రజలు ఓట్లేస్తే ముఖ్యమంత్రి అవుతానని చెప్పారంటూ మాట్లాడారు. నిమిషంపైనా మాట్లాడిన మాటల్లో మొదట్నుంచి చివరి వరకూ ఆయన ఏం అన్నారో, ఎవర్ని తిట్టబోయి ఎవర్ని తిట్టారో బహుశా ఆయనకు కూడా అర్థమైఉండదేమో. కాసేపటికి తేరుకుని ఆ తడబాటు దిద్దుకున్నా అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com