AP Deputy CM Pawan : నేడు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

AP Deputy CM Pawan : నేడు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
X
అంజన్నను దర్శించుకోనున్న పవన్ కళ్యాణ్

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్… కొండగట్టు అంజన్నను దర్శించుకోనున్నారు. ఇవాళ ఉదయం 11గంటలకు జగిత్యాల జిల్లాలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి రానున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శుక్రవారం బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ పరిసరాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.

పవన్ కల్యాణ్ ఒక్కరే కాదు మెగా ఫ్యామిలీ మొత్తం ఆంజనేయ స్వామిని ఇష్టంగా కొలుస్తారు. ప్రజారాజ్యం 2009 ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ కు కొండగట్టు సమీపంలో ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. హైటెన్షన్ వైర్లు పడటం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. అప్పటి నుంచి కొండగట్టు అంజన్నను పవన్ కల్యాణ్ ఇష్ట దైవంగా ఆరాధిస్తున్నారు. ఏ మంచి పని చేపట్టినా ముందుగా కొండగట్టు వెళుతుంటారు. గత ఎన్నికల్లో ప్రచారం కోసం పవన్ కల్యాణ్ వారాహి అనే ప్రత్యేక వాహనాన్ని ఉపయోగించారు. ఆ వాహనానికి తొలి పూజ కొండగట్టు అంజన్న ఆలయంలో నిర్వహించారు. ప్రస్తుతం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ‘వారాహి’ అమ్మవారి దీక్షలో ఉన్నారు. 11 రోజుల పాటు దీక్ష కొనసాగనుంది.

ఎన్నికల ముందు వారాహి వాహనానికి పవన్ కళ్యాణ్ కొండగట్టులోనే పూజలు నిర్వహించారు. జనసేన అధినేతకు భారీ స్వాగత ఏర్పాట్లు చేసింది తెలంగాణ జనసేన విభాగం. మరోవైపు.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొండగట్టు అంజన్న ఆశీస్సులతో తమకు మంచి జరిగిందని పవన్ కల్యాణ్ మరోసారి శనివారం కొండగట్టు పర్యటనకు వస్తున్నట్లు జనసేన పార్టీ శ్రేణులు తెలిపారు. దర్శనం తరువాత రోడ్డు మార్గంలో సాయంత్రం 4.30గంలకు హైదరాబాద్ నివాసానికి చేరుకుంటారు. తమ అధినేత కోసం తెలంగాణ జనసేన భారీ స్వాగత ఏర్పాట్లు చేసింది. పవన్ రాక గురించి ముందుగానే ప్రచారం జరగడంతో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు పెద్ద ఎత్తున కొండగట్టుకు చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి అక్కడంతా పటిష్ట బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అఖండ విజయం సాధించింది. కూటమి విజయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రధాన పాత్ర పోషించారు.


Next Story