ఆలయాలు, ప్రార్థన మందిరాల వద్ద భద్రత మీదే : డీజీపీ గౌతం సవాంగ్
రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, ప్రార్థన మందిరాల వద్ద పూర్తి స్థాయిలో భద్రత ఉండే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకోవాలని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ సూచించారు. పరిసర ప్రాంతాలు స్పష్టంగా కనిపించేలా లైట్లు, సీసీ కెమెరాలను అమర్చుకోవాలన్నారు. అంతేకాదు అగ్ని ప్రమాద నియంత్రణ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. నిరంతరం పర్యవేక్షించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు. అన్ని దేవాలయాలు, ప్రార్థన మందిరాలను జియో ట్యాగింగ్, నిరంతర నిఘా కొనసాగించే విధంగా ఎస్పీలను అప్రమత్తం చేశామన్నారు. దేవాలయాలు, ప్రార్థన మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. మతాల మధ్య చిచ్చుపెడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతం సవాంగ్ హెచ్చరించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com