ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు రిలీజ్

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు రిలీజ్

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి బొత్ససత్యనారాయణ ఈ రోజు విజయవాడలో ఫలితాలను రిలీజ్ చేశారు. మూడేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది ఇంటర్ మార్కుల వెయిటేజీతో కలిపి ఫలితాలను రిలీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అగ్రికల్చర్, ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ ఈఏపీసెట్ 2023 నిర్వహించారు. ఈ ఎగ్జామ్ కు మొత్తం 3 లక్షల 38వేల 739 మంది అప్లై చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఇంజనీరింగ్ పరీక్షలకు 2.38 లక్షలమంది, అగ్రికల్చర్ లో 1 లక్షమంది, ఫార్మాలో 2 లక్షల 38 వేల 180మంది దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. హాజరైన వారిలో 76.32 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.

APSCHE ఇంజినీరింగ్‌ విభాగంలో చల్లా ఉమేష్‌ వరుణ్‌ ప్రథమ స్థానంలో నిలిచాడు. అగ్రికల్చర్‌ విభాగంలో బూరుగుపల్లి సత్యరాజా జస్వంత్‌ టాప్‌ ర్యాంక్‌ సాధించాడు. అబ్బాయిలతో పోలిస్తే, 3.99 శాతం మంది అమ్మాయిలు AP EAMCETకి అర్హత సాధించారు. అయితే ఈ ఏడాది ఇంజినీరింగ్‌ విభాగంలో టాప్‌ 10 ర్యాంక్‌ హోల్డర్లు అందరూ అబ్బాయిలే.

Tags

Read MoreRead Less
Next Story