Ap : ఎన్నికల సమరంలో గెలుపోటములు ఇలా

ఆంధ్రనాట జగన్ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి తావులేదని చాటి చెప్పారు. ఐదేళ్ల క్రితం అసాధారణ మెజార్టీతో వైకాపాను అధికారం పీఠంపై కూర్చోబెట్టిన ప్రజలే,ఇప్పుడా పార్టీని అథఃపాతాళానికి తొక్కేశారు. తెదేపా, జనసేన, భాజపా కూటమికి కనీవినీ ఎరగని విజయాన్ని,కట్టబెట్టారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగాను 164 సీట్లు, 25 లోక్‌సభ స్థానాల్లో 21 సీట్లను కూటమి కైవసం చేసుకుంది. 144 స్థానాల్లో పోటీ చేసిన తెదేపా 135 చోట్ల గెలుపొందింది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్నీ....·కైవసం చేసుకుని రికార్డ్ సృష్టించింది. భాజపా 10 స్థానాల్లో పోటీ చేసి 8 చోట్ల గెలిచింది.25లోక్‌సభస్థానాల్లో తెదేపా 16, భాజపా 3, జనసేన 2 గెలుచుకున్నాయి. పోటీ చేసిన 17 స్థానాల్లో......... తెదేపా కేవలం కడప ఎంపీ స్థానంలోనే ఓడింది. జనసేన రెండు చోట్లా గెలిచింది. భాజపా ఆరు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసి మూడు చోట్లే గెలిచింది. వైనాట్ 175 అని బీరాలు పలికిన జగన్ పార్టీ... 11 అసెంబ్లీ సీట్లు, నాలుగు లోక్‌సభ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 8 జిల్లాల్లో ఆ పార్టీ ఒక్క స్థానాన్నీ దక్కించుకోలేదంటే ప్రజలు ఎంతలా తిరస్కరించారో అర్థమవుతుంది.
ఎస్సీ, ఎస్టీలు అందరిదీ ఒకే జపం. 29 ఎస్సీ నియోజకవర్గాల్లో 27 చోట్ల తెదేపా, మిత్రపక్షాలు గెలుపొందాయి. కేవలం యర్రగొండపాలెం, బద్వేలులో మాత్రమే..చావు తప్పికన్ను లొట్టపోయిన చందాన వైకాపా గట్టెక్కింది. 7 ఎస్టీ నియోజకవర్గాలకుగాను 5 చోట్ల కూటమి అభ్యర్ధులే విజయం సాధించారు. అరకు వ్యాలీ, పాడేరులో మాత్రమే వైకాపా విజయం సాధించింది. గత ఎన్నికల్లో కొండపి మినహా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలన్నింటినీ వైకాపానే కైవసం చేసుకుంది. సంప్రదాయంగా ఒకప్పుడు కాంగ్రెస్, ఆ తర్వాత వైకాపాకు ఎన్నికల్లో గెలుపునకు వెన్నెముకగా నిలిచిన ఈ వర్గాలు.. ఈ సారి వైకాపా వెన్ను విరిచాయి.....! మాటలతో మభ్య పెట్టినందుకు ముస్లింలూ జగన్‌కు బుద్ధిచెప్పారు. వైకాపా ఆరాచకశక్తులు ముస్లింలపై దాడులు చేస్తుంటే కళ్ళప్పగించి చూసిన ఆయనకు సమయం వచ్చినప్పుడు తాము ఎలా ప్రతిస్పందిస్తామో చూపించారు. వైకాపాకు పట్టుండే రాయలసీమ ప్రాంతంలోనూ ఆ పార్టీ వెన్నువిరిచారు. రాష్ట్రవ్యాప్తంగా 35వేల మంది ముస్లిం ఓటర్లున్న 20నియోజకవర్గాలను ప్రాతిపదికగా తీసుకుంటే ఒక్కచోట కూడా వైకాపా గెలుపొందలేదు. జనాభాకు అనుగుణంగా 70శాతం మంది ఓటర్లుంటారని అంచనా. ఆ ప్రకారం, ఉమ్మడి కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో అత్యధికంగా మైనారిటీ ఓట్లున్న నియోజకవర్గాలున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మొదలు హిందూపురం వరకూ అన్నిచోట్ల ఒకే ట్రెండ్ కొనసాగింది.
కూటమికి అనుకూలంగా వెల్లువెత్తిన ఓట్ల సునామీలో వైకాపా కొట్టుకుపోయింది. ఝంఝూమారుతం ముందు ఫ్యాన్ గాలి చిన్నబోయింది. అధికారంలో ఉన్న పార్టీ అతి తక్కువ స్థానాలకు పరిమతమవడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. ‘వైనాట్ కుప్పం’అని సవాల్ చేసిన జగన్‌కు పులివెందులలో గత ఎన్నికలతో పోలిస్తే 30 వేలకుపైగా మెజార్టీ తగ్గింది. ఐదేళ్ల వైకాపా పాలనలో రెండు విడతల్లో మంత్రులుగా ఉండి. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసినవారిలో ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప అందరూ ఓడిపోయారు. పెద్దిరెడ్డి కూడా.. తక్కువ మెజార్టీతో బయటపడ్డారు. తెలుగుదేశం నుంచి వైకాపాలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేశ్, కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేశ్, వల్లభనేని వంశీ ఓడిపోయారు.! వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరి పోటీ చేసిన వారంతా గెలిచారు. జగన్ కేబినెట్‌లో ఐదేళ్లూ మంత్రిగా ఉండి చివరి నిమిషంలో తెదేపాలోకి వచ్చిన గుమ్మనూరు జయరాం విజయం సాధించారు. తెలుగుదేశం సిట్టింగ్ MLAలందరూ మరోసారి జయభేరి మోగించారు. కూటమి అభ్యర్థులకు చాలాచోట్ల అసాధారణ మెజార్టీలు వచ్చాయి. 30 వేలకుపైగా మెజార్టీ సాధించిన విజేతలు చాలా మంది ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com