AP Election Campaign : రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా తెలుగుదేశం అభ్యర్థుల ప్రచారాలు

AP Election Campaign : రాష్ట్ర వ్యాప్తంగా   జోరుగా తెలుగుదేశం అభ్యర్థుల ప్రచారాలు
గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల వ్యూహం

రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం అభ్యర్థుల ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. కూటమి అభ్యర్థులతో కలసి సూపర్‌సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరిస్తూ... ఓట్లు అభ్యర్థించారు. పలు జిల్లాల్లో అనుచరులతో కలిసి వైకాపా నేతలు తెలుగుదేశంలో చేరారు. రాష్ట్ర పరిస్థితులు మారాలంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేతలు స్పష్టంచేశారు.

కర్నూలులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ. భరత్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలతో పాటు టీజీ భరత్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చేసే అభివృద్ధి పనులను కాలనీ వాసులకు వివరించారు. ముస్లింలందరూ అభివృద్ధికి పాటుపడే కూటమి సభ్యులను గెలిపించేందుకు ఓట్లు వేయాలని తెలిపారు. తిరుపతి లోకసభతో పాటు అన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలుస్తారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు.

అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి, కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వడ్డెర్లు పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో కూటమి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి రోడ్‌ షో నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం భాజపా అభ్యర్థి సత్యకుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఐదేళ్లుగా ధర్మవరంలో రాక్షసపాలన చేశారని వచ్చే ఎన్నికల్లో కేతిరెడ్డికి బుద్ధి చెప్పి ఇంటికి పంపుతామన్నారు. చేనేత పరిశ్రమను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్లలో తెదేపా అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ముస్లిం సోదరులతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఆరుపథకాల గురించి వివరిస్తూ ప్రచారం సాగించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి గొండు శంకర్ ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు తీసుకువచ్చిన సూపర్ సిక్స్ ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఉమ్మడి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

వైకాపా నుంచి తెలుగుదేశంలోకి వలసల పరంపర కొనసాగుతోంది. బాపట్లజిల్లా పర్చూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు సమక్షంలో పలువురు వైకాపా నేతలు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్టాభివృద్ది చంద్రబాబుతోనే సాధ్యమని కాపునేతలు తెలిపారు. నెల్లూరు జిల్లా సంగంలో కూటమి నేతలు ప్రజాగళం కార్యక్రమంలో పలువురు వైకాపా నాయకులు తెదేపాలోకి చేరారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆనం కోరారు.

తిరుపతి జిల్లా చంద్రగిరిలో వైకాపాకు ఎదురుదెబ్బ తగిలింది.చిన్నగొట్టిగల్లు మండలానికి చెందిన వైకాపా వైస్ ఎంపీపీ సునీతా దామోదరంతో పాటు 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో వైకాపా నాయ‌కుడు, చ‌ల్లా రాజ‌గోపాల్ త‌న అనుచ‌రుల‌తో క‌లిసి తెదేపాలో చేరారు. తెదేపా ప్రొద్దుటూరు అభ్యర్థి వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైకాపా నాయకుల తీరు నచ్చక నంద్యాలలోని పలు ప్రాంతాలకు చెందిన 600 మంది ఫరూక్ ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరారు.

Tags

Read MoreRead Less
Next Story