పంచాయతీ ఎన్నికల సన్నాహాల్లో ఎస్ఈసీ.. సుప్రీంకోర్టుకు సర్కారు..

ఏపీలో పంచాయతీ ఎన్నికల రద్దుకు ప్రభుత్వం శతవిథాలా ప్రయత్నిస్తూనే ఉంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. రాష్ట్రంలో కరోనా తీవ్రత, వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనాసాగుతున్నా దృష్ట్యా హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరింది. ప్రభుత్వం దఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ డెయిరీ నంబరు-1796 కేటాయించింది. నేడు ప్రభుత్వం తరపు న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తి ముందు తమ వాదనలు వినిపించవచ్చని న్యాయనిపుణులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా ఎస్ఈసీ కూడా ప్రభుత్వం అప్పీలుపై ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. అప్పీలును విచారణ చేసేటప్పుడు తమ వాదనలూ వినాలని కోరింది. తమ వాదనలు విన్న తర్వాతే తుది ఉత్తర్వులు ఇవ్వాలని తన పిటిషన్‌లో ఎస్ఈసీ కోరింది.
మరోవైపు ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలవనున్నారు. తాజా పరిణామాలు, ఎన్నికల నిర్వహణపై గవర్నర్ తో నిమ్మగడ్డ చర్చించనున్నారు. అలాగే ఎన్నిలక ప్రక్రియకు ప్రభుత్వం, ఉద్యోగులు సహకరించేలా చూడాలని గవర్నర్ తో చర్చించనున్నారు. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో గవర్నర్ తో ఎస్ఈసీ కమిషనర్ నిమ్మగడ్డ భేటీ కానుండడం ప్రాధాన్యత సంతరించకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com