30 Oct 2020 12:00 PM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / అట్రాసిటీ చట్టాన్ని...

అట్రాసిటీ చట్టాన్ని వారిపైనే ప్రయోగిస్తారా? : మాజీ హోంమంత్రి చినరాజప్ప

అట్రాసిటీ చట్టాన్ని వారిపైనే ప్రయోగిస్తారా? : మాజీ హోంమంత్రి చినరాజప్ప
X

అమరావతి రాజధానిని భగ్నం చేయాలని మూడు రాజధానులను జగన్ సర్కారు తెరపైకి తెచ్చిందని మాజీ హోం మంత్రి చినరాజప్ప అన్నారు. గత 325 రోజులుగా ఉద్యమం చేస్తున్న రైతులపై కేసులు పెట్టడం, లాఠీలతో కొట్టించడం, ఇప్పుడు బేడీలు వేయడం చాలా హేయమైన చర్య అని అన్నారు. అధికార పార్టీ అహంకారం పరాకాష్టకు చేరిందన్నారు. ఎస్సీ, ఎస్టీల రక్షణ కోసం తెచ్చిన అట్రాసిటీ చట్టాన్ని వారిపైనే ప్రయోగిస్తారా అని చినరాజప్ప ప్రశ్నించారు. కేసు పెట్టిన వ్యక్తి ఫిర్యాదు వెనక్కి తీసుకున్నా పోలీసులు రైతులను అరెస్ట్ చేయడం దారుణమని విమర్శించారు. ఇన్నాళ్లూ అమరావతి ఉద్యమం ఒక కులానికి సంబంధించిందని ప్రచారం చేసిన ప్రభుత్వం... ఇప్పుడు ఎస్సీలు, బీసీలను ఎందుకు అరెస్ట్ చేసిందో చెప్పాలని చినరాజప్ప డిమాండ్ చేశారు.

  • By kasi
  • 30 Oct 2020 12:00 PM GMT
Next Story