RRR Ticket Price In AP: 'ఆర్ఆర్ఆర్' సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

RRR Ticket Price In AP: ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..
RRR Ticket Price In AP: పేదలు సినిమా చూడొద్దా అని డైలాగులు చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు గేట్లు బార్లా తెరిచింది.

RRR Ticket Price In AP: పేదలు సినిమా చూడొద్దా అని డైలాగులు చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు గేట్లు బార్లా తెరిచింది. మీ ఇష్టం.. సినిమా రిలీజ్‌ అయిన పది రోజుల వరకు రేట్లు పెంచుకోవచ్చని చెప్పేసింది. సినీ పెద్దలను కావాలనే తన దగ్గరకు పిలిపించుకోవడం, చిరంజీవి వంటి అగ్రతారలు ఒకటికి రెండుసార్లు జగన్‌ను కలవడం.. ఇవన్నీ డ్రామాలేనా అన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది.

నిజంగా చిరంజీవి మధ్యవర్తిత్వం పనిచేసి ఉంటే, చిరంజీవి మాటకే గనక విలువ ఇచ్చి ఉంటే.. భీమ్లానాయక్‌ సినిమాకు ముందే జీవో రావాల్సిందని మాట్లాడుకుంటున్నారు జనం. అసలు సినీ పెద్దలంతా వెళ్లి జగన్‌ను కలిసిందే.. భీమ్లా నాయక్‌ వంటి పెద్ద హీరోల సినిమా రిలీజ్‌ అవుతోందన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి. కాని, ఆ సినిమా విడుదల తరువాతే జీవో ఇచ్చింది ప్రభుత్వం.

అటు చిరంజీవి మధ్యవర్తిత్వంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం కొందరి కోసమే పనిచేస్తున్నారా, అందరి కోసమా అని ప్రశ్నిస్తున్నారు. భీమ్లా నాయక్‌ రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్నప్పుడే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిందని, కనీసంలో కనీసం ఏ ట్విట్టర్ ద్వారానో ప్రభుత్వాన్ని అడగాల్సిందని అంటున్నారు. ఓవైపు ప్రభుత్వం కావాలనే భీమ్లా నాయక్‌ వరకు వేచి చూసే ధోరణిలో ఉందని తెలిసినా.. చిరంజీవి వంటి వారు ఒక్క మాట మాట్లాడలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టాలీవుడ్‌పై జగన్ సర్కార్‌ తీరు చూసి ప్రతి ఒక్కరూ నవ్వుకుంటున్నారు ఏపీ జనం. పవన్‌ కల్యాణ్‌పై కక్ష గట్టిన ప్రభుత్వం.. సరిగ్గా వకీల్‌సాబ్‌ సినిమా సమయంలో జీవో తెచ్చి.. ఐదు రూపాయల కనీస టికెట్‌ను నిర్ణయించిందనే విమర్శలు వినిపించాయి. భీమ్లా నాయక్‌ సినిమా విడుదల అయిన తరువాతనే కొత్త జీవో జారీ చేసి తన పంతం నెగ్గించుకుందని జగన్ ప్రభుత్వాన్ని డైరెక్టుగానే ఏకిపారేస్తున్నారు.

అంటే, జగన్ సర్కారుకు పంతాలు, కక్షసాధింపులు తప్పితే.. ఒక విధానం అంటూ లేదా అని విమర్శిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ సినిమాలు, బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలప్పుడు.. ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుందన్నారు. నాని ప్రశ్నించినందుకు శ్యామ్‌సింగరాయ్‌ ఆడుతున్న థియేటర్లపై అధికారులతో దాడులు చేయించారని చెప్పుకుంటున్నారు.

తన దగ్గరకు వచ్చి అడిగారు కాబట్టి.. రాధేశ్యామ్‌, ట్రిపుల్ఆర్ సినిమాలకు జీవోలతో సంబంధం లేకుండా వెసులుబాటు ఇచ్చారనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఏపీలో 20 శాతం షూటింగ్‌ జరుపుకోకపోయినా ఫర్వాలేదు.. టికెట్‌ రేట్లు పది రోజుల పాటు పెంచుకునేందుకు అనుమతి ఇస్తున్నాం అని స్వయంగా మంత్రి పేర్ని నాని ప్రకటించడం చూసిన జనం.. టాలీవుడ్‌ చర్చలను పెద్ద డ్రామాగా అభివర్ణిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story