AP Anganwadi Protest : ఉదృతమవుతున్న అంగన్వాడీల సమ్మె

AP Anganwadi Protest :  ఉదృతమవుతున్న అంగన్వాడీల సమ్మె
అంగన్వాడీలకు డెడ్ లైన్.. వేటు వేసేందుకు ప్రభుత్వం రెడీ

సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు (బుధవారం) కలెక్టరేట్ల ముట్టడికి అంగన్వాడీలు పిలుపునిచ్చారు. దీంతో ఆయా జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తమ సమస్యలు పరిష్కరించాలని గత 23 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. సమ్మెలో భాగంగా ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముట్టడికి అంగన్ వాడి వర్కర్స్ పిలుపునివ్వడంతో దాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఎక్కడికక్కడ అంగన్వాడీలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

ఏపీలో గత కొన్ని రోజులుగా అంగన్‎వాడీల సమ్మె కొనసాగుతున్న సంగతి తెలిసిందే.అంగన్‎వాడీల నిర్వహిస్తున్న సమ్మెపై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది. ఈనెల 5వ తేదీ లోపు విధులకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.అంగన్ వాడీ కార్యకర్తలకు విధులకు హాజరుకానీ పక్షంలో శాఖాపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అంగన్‎వాడీ కార్యకర్తల సమ్మె కారణంగా అంగన్‎వాడీ కేంద్రాలలో గర్భిణీ స్త్రీలు, పసి పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న రాష్ట్ర సర్కార్ కార్యకర్తలు విధులకు హాజరుకావాలని విజ్ఞప్తి చేసింది.

22 రోజులుగా విధులు బహిష్కరించి సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ తమ డిమాండ్లపై ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ కర్నూలు కలెక్టరేట్‌ ముట్టడికి వెళ్తున్న దేవనకొండ ,ఆస్పరి, ఆలూరు మండలాల అంగన్వాడీ కార్యకర్తలను బుధవారం దేవనకొండ పోలీసులు ఈదుల దేవరబండ దగ్గర అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీ కార్యకర్తలు, సిఐటియు నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమను కలెక్టరేట్‌ పంపించే వరకు రోడ్డు పైనే అడ్డంగా కూర్చుంటామని తెలిపారు. ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని నినాదాలు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story