AP PRC: ఏపీ ప్రభుత్వంతో పీఆర్సీ ఉద్యోగ సంఘాల చర్చలు విఫలం..

AP PRC: ఏపీ ప్రభుత్వంతో పీఆర్సీ ఉద్యోగ సంఘాల చర్చలు విఫలం..
AP PRC: పీఆర్సీపై ఉద్యోగ సంఘాల్ని చర్చలకు పిలిచిన జగన్‌ ప్రభుత్వం.. మరోసారి పాత పాటే పాడింది.

AP PRC: పీఆర్సీపై ఉద్యోగ సంఘాల్ని చర్చలకు పిలిచిన జగన్‌ ప్రభుత్వం.. మరోసారి పాత పాటే పాడింది. ఎన్నో ఆశలతో చర్చలకు వచ్చిన ఉద్యోగ సంఘానేతల ఆశలపై నీళ్లు చల్లింది. ఆర్థిక శాఖ అధికారుల చర్చల అనంతరం.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ఫిట్‌మెంట్‌పై ఎలాంటి మార్పు లేనప్పుడు చర్చలకు ఎందుకు పిలిచారంటూ మండిపడుతున్నారు ఉద్యోగ సంఘాలు.

పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఏపీ సచివాలయంలో ఆర్ధిక శాఖ అధికారులతో.. ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఆర్థికశాఖ అధికారులు శశిభూషణ్‌ కుమార్‌, సత్యనారాయణల నేతృత్వంలో విడతల వారీగా ఉద్యోగ సంఘాలతో చర్చించారు. ప్రస్తుతం 27 శాతం ఐఆర్ ఇస్తున్నందున కొద్దిమేర పెంచి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు జారీచేశారని పేర్కొన్నారు ఆర్ధికశాఖ అధికారులు.

కొత్తగా రూపొందించిన ప్రతిపాదనలను ఉద్యోగ సంఘాలకు వివరించారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ విడతల వారి సమావేశంతో ఎలాంటి ఉపయోగం లేదన్నారు ఏపీ జేఏసీ ఛైర్మన్‌ బండి శ్రీనివాసులు. అధికారుల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వారం పది రోజుల్లో పీఆర్‌సీ ఇస్తామని సీఎం తిరుపతిలో చెప్పారని, అమరావతిలో సీఎస్‌ చెప్పారని కానీ ఇప్పటివరకు ఆ హామీ నెరవేర్చలేదన్నారు.

సమావేశానికి పిలిచి పీఆర్‌సీ ఎంత ఇస్తారో చెప్పకుండా ఆర్థిక పరమైన అంశాలు వివరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 14.29శాతం ఫిట్‌మెంట్‌ ఆమోదయోగ్యం కాదని..చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప.. ఫలితం ఉండటంలేదన్నారాయన. జనవరి 3న జరిగే జేఏసీ సమావేశంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు

ప్రతి సారి ప్రభుత్వం నుంచి ఒకటే సమాధానం వస్తోందంటూ మండిపడ్డారు అమరావతి జేఏసీ ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు. 14.29 శాతం ఫిట్మెంట్ పైనే ప్రభుత్వం మాట్లాడుతోందని.. దాన్ని పరిగణనలోకి తీసుకునేది లేదని స్పష్టంగా చెప్పారు. ఉద్యోగులను అవమానించడానికి సమావేశాలు నిర్వహిస్తున్నారు తప్ప ఉపయోగం లేదని ఫిట్‌మెంట్‌ గురించి మాట్లాడటానికి చెప్పారని.. ఫిట్‌మెంట్‌ ఎంత ఇస్తారంటే మళ్లీ మొదటికొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. spot with music

మొత్తానికి.. ప్రభుత్వంతో చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో ఉద్యోగ సంఘాల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ తీరు ఇలాగే ఉంటే... తదుపరి కార్యాచరణకు వెళ్లక తప్పదనే ఆలోచన చేస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. మరి ఉద్యోగుల ఆగ్రహాన్ని చల్లార్చిందేకు.. ప్రభుత్వం మళ్లీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్ని ఆసక్తిగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story