AP GOs: ఇకపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగు భాషలో కూడా

AP GOs:  ఇకపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగు భాషలో కూడా
X
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు (జిఓలు) తెలుగు భాషలో కూడా జారీ చేయనుంది. గత నెలలోనే ఈ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించగా.. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది. ప్రస్తుతం ఈ ప్రక్రియను హోంశాఖ ప్రారంభించింది. తొలిసారిగా ఒక ఖైదీ పెరోల్‌కు సంబంధించిన జిఓ ను తెలుగు భాషలో విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం స్థానిక ప్రజల కోసం కీలకమైన చర్యగా భావిస్తున్నారు.

ప్రతీ జిఓ మొదట ఇంగ్లీషులో విడుదల కానుంది. ఆ తరువాత రెండు రోజుల్లోపు అదే జిఓను తెలుగు భాషలో జారీ చేస్తారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వ నిర్ణయాలు, ఉత్తర్వులు ప్రజలకు సులభంగా అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు రెండు భాషల్లో జారీ చేయాలనే ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరింత పారదర్శకతను, భాష పట్ల గౌరవాన్ని అందజేస్తుందని భావిస్తున్నారు. తెలుగు భాషలో ఉత్తర్వుల ప్రక్రియ త్వరితగతిన కొనసాగేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Tags

Next Story