పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌పై హౌస్‌ మోషన్‌ పిటిషన్

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌పై హౌస్‌ మోషన్‌ పిటిషన్

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌పై హౌస్‌ మోషన్‌కు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. హైకోర్టుకు నేటి నుంచి సెలవులు కావడంతో హౌస్‌ మోషన్‌ పిటిషన్ వేసింది. దీంతో న్యాయమూర్తి ఇంటి వద్దనే.. ఉదయం పదిన్నరకు హౌస్‌ మోషన్‌ పిటిషన్‌పై విచారణ జరగనుంది. కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికలను నిర్వహించలేమని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు, కరోనా వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తుండడంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వ్యాక్సిన్‌ పంపిణీ పనిలోనే నిమగ్నమై ఉంటారని చెబుతోంది.


Tags

Read MoreRead Less
Next Story