AP GOVT : రాజధాని కేసును విచారించండి

AP GOVT : రాజధాని కేసును విచారించండి
సోమవారం బెంచి ముందు ప్రస్తావించడానికి అనుమతి

అమరావతి రాజధాని కేసును వెంటనే విచారించాలంటూ సుప్రీంకోర్టును అభ్యర్దించింది జగన్‌ సర్కారు. ఈ నెల 6న కోర్టు ముందు ప్రస్తావించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్‌ ఆన్‌ రికార్డ్స్‌ శనివారం లేఖ రాశారు. ఈ కేసుకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా సత్వరమే విచారణకు తీసుకోవాలని కోరారు. జాబితాలో తొలి ప్రాధాన్యం కింద ఉంచాలని కోరారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ దీనికి అనుమతిస్తే కేసు అంశాన్ని సోమవారం కోర్టు ముందు ప్రస్తావిస్తారు. ఏరోజు విచారణ జరిపేదీ రేపు సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది. అయితే సత్వర విచారణ కోసం శనివారం అందిన లేఖల్లో12 విజ్ఞప్తులను రిజిస్ట్రీ పరిగణనలోనికి తీసుకుని ఆ కేసులను సోమవారం బెంచి ముందు ప్రస్తావించడానికి అనుమతి ఇచ్చింది. ఒకవేళ రివైజ్డ్‌ జాబితాలో ఉంటే సోమవారం ప్రస్తావనకు రానుంది. రాజధాని కేసును తొలి వరుసలో పెట్టాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం అభ్యర్థించడం చర్చనీయాంశంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story