AP: అమ్మకానికి ఎంబీబీఎస్ సీట్లు... ఒక్కో సీటు రేటు రూ. పది లక్షలు

ఎంబీబీఎస్ సీట్లను అమ్మకానికి పెట్టింది ఏపీ సర్కార్. కేవలం 32 కోట్ల కోసం మెరిట్ విద్యార్థులకు అన్యా యం చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న 5 మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్ల అమ్మకానికి రెడీ అయ్యారు. ప్రతిపాదనలు కూడా సిద్ధమయ్యాయి. త్వరలోనే బీ కేటగిరి సీట్లు అమ్మకానికి సంబంధించిన జీవో విడుదల కానుంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు అమ్మకానికి పెట్టిన ఘనత జగన్ సర్కార్ కు దక్కనుం ది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సిద్ధమైంది.
ఇప్పటికే ఐదు మెడికల్ కాలేజీల్లో ఆడ్మిషన్లకు ఎన్‌ఎంసీ అనుమతిచ్చింది. మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించింది. కేంద్రం నిబంధనల ప్రకారం ప్రతి రాష్ట్రంలో 15ు సీట్లు నేషనల్ పూల్‌కు ఇవ్వాలి. అలా 113 సీట్లు పోతాయి. మిగిలిన 637 సీట్లను సాధారణంగా హెల్త్‌వర్సిటీ అధికారులు కౌన్సెలింగ్ ద్వా రా భర్తీ చేయాలి. అయితే ఇప్పుడు కొత్త విధానంలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీ చేయనున్నారు. అనుసరించనున్నారు. అందులోభాగంగా మొత్తం సీట్లను ఏ, బీ కేటగిరీలుగా విభజిస్తుంది. ఏ కేటగిరి సీట్లను కన్వీనర్ కోటా కింద(ఫ్రీ పరిగణిస్తారు. బీ కేటగిరి సీటుకు డబ్బులు కట్టి చేరాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఇప్పటి వర కూ ఇలా సీట్లు అమ్ముకున్న దాఖలాలు లేవు.
మరోవైపు మొత్తం సీట్లను ఏ, బీ కేటగిరీలుగా విభజిస్తుంది. ఏ కేటగిరి సీట్లను కన్వీనర్ కోటా కింద ఫ్రీ సీట్లగా పరిగణిస్తారు. బీ కేటగిరి సీటుకు డబ్బులు కట్టి చేరాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఇలా సీట్లు అమ్ముకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం 11 పాత మెడికల్ కాలేజీలున్నాయి. వీటిల్లో దాదాపు 2వేల500 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉంటాయి. ఈ విధానంతో మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని నిపుణులు అంటున్నారు. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం ఎంబీబీఎస్ సీట్లను అమ్మకానికి మొగ్గు చూపుతుంది. రాష్ట్రంలో ఏ కేటగిరి సీటు ఫీజు 70 వేలు. బీ కేటగిరి సీటు ఫీజు 10 లక్షల వరకూ నిర్ణయించనున్నట్లు సమాచారం.
అయితే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్ల అమ్మకం అనేది మాత్రం చట్ట విరుద్ధమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పరిధిలో ఉన్న సీట్లు అమ్మాలంటే చట్ట సవరణలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. నేషనల్ హెల్త్ మిషన్ అనుమతి కూడా కావాలని అంటున్నారు. అయితే జగన్ సర్కార్ ఇవేమి పట్టించుకోకుండా ఎంబీబీఎస్ సీట్ల అమ్మకానికి సిద్ధమవుతోందని అంటున్నారు.మరోవైపు విద్యార్ధులు,విద్యార్థి సంఘాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఇక అడ్మిషన్లు జరుపుతున్న కాలేజీల్లో నాలుగింటి నిర్మాణానికి నాబార్డు నుంచి రుణం తీసుకుంది ప్రభుత్వం.మచిలీపట్నం మెడికల్ కాలేజీని మాత్రమే కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేపట్టారు. కేంద్రం 375 కోట్ల సాయం అందించింది. ఇక విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, నంద్యాల కాలేజీల నిర్మాణం నాబార్డు నిధులతో చేపడుతున్నారు.పాడేరు, పిడుగురాళ్ల కాలేజీలను కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com