అజ్ఞాతంలోకి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ

అజ్ఞాతంలోకి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ
ఆయన కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. రెండు ప్రత్యేక బృందాలు సూర్యనారాయణ కోసం గాలింపు ముమ్మరం

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. రెండు ప్రత్యేక బృందాలు సూర్యనారాయణ కోసం గాలింపు ముమ్మరం చేశాయి. ఉద్యోగుల హక్కుల సాధన కోసం..

సూర్యనారాయణ గవర్నర్‌ను కలవడంతో ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణ కోసం ఆయన ఆందోళనకు పిలుపునిచ్చారు. సూర్యనారాయణ చర్యలతో ఏపీ సర్కార్ రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం.. కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఇప్పటికే వాణిజ్య పన్నుల విభాగంలో నలుగురు సూర్యనారాయణ సహచరులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.


Tags

Read MoreRead Less
Next Story