ఈసీకి ఆ అధికారం లేదంటూ తిప్పిపంపిన రాష్ట్ర ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం, ఎస్‌ఈసీ మధ్య ఘర్షణ వైఖరి కొనసాగుతోంది. ఎన్నికల కమిషనర్ ఇచ్చిన సెన్సూర్ ఆర్డర్ ను తిరస్కరించింది ప్రభుత్వం. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్‌పై.. అభిశంసన ఆర్డర్ ఇచ్చారు SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్. అయితే ఈసీకి ఆ అధికారం లేదంటూ తిప్పిపంపింది రాష్ట్ర ప్రభుత్వం. అధికారుల వివరణ తీసుకోకుండా ప్రొసీడింగ్స్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. SEC సెన్సూర్ తిరస్కరిస్తూ జీవోలు జారీ చేసింది.
2021 ఓటర్ల జాబితా ప్రచురణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్‌ను అభిశంసన చేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్. దీని వల్ల 3 లక్షల 60వేల మంది ఓటర్లు ఓటుహక్కుకు దూరమయ్యాన్నారు. వీరిద్దరూ విధులు నిర్వహించేందుకు అనర్హులంటూ ప్రకటించారు ఎస్‌ఈసీ. వీరిద్దరిని తొలగించాలని ప్రొసీడింగ్స్ జారీ చేశారు.
ఓటర్ల జాబితా ప్రచురిస్తామని కోర్టుకు చెప్పి కూడా ఆ విధి నిర్వహించ లేదని అందుకే వీరిని అభిశంసన చేస్తున్టన్లు ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఎన్నికల కమిషన్ వల్ల జరిగిన ఈ తొలగింపును.. వీరి సర్వీస్ రికార్డుల్లో సైతం నమోదు చేయాలన్నారు. ఇప్పుడు ఇదే సెన్సూర్ ఆర్డర్ ను తిప్పిపంపింది ప్రభుత్వం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com