ఆనందయ్య కరోనా మందు పంపిణీ పిటిషన్ పై విచారణకు హైకోర్టు సమ్మతి..!

ఆనందయ్య కరోనా మందు పంపిణీ పిటిషన్ పై విచారణకు హైకోర్టు సమ్మతి..!
ఆనందయ్య కరోనా మందు పంపిణీ చేయాలని దాఖలైన రెండు పిటిషన్ల విచారణకు ఏపీ హైకోర్టు అనుమతించింది. ఈ నెల 27న హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టనుంది.

ఆనందయ్య కరోనా మందు పంపిణీ చేయాలని దాఖలైన రెండు పిటిషన్ల విచారణకు ఏపీ హైకోర్టు అనుమతించింది. ఈ నెల 27న హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టనుంది. ప్రభుత్వం ముందు.. పంపిణీకి ఖర్చులు ఇతర సౌకర్యాలు కల్పించాలని పిటిషనర్లు కోరారు. శాంతిభద్రతల సమస్య లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. లోకాయుక్త ఆదేశాల ప్రకారం మందు పంపిణీ ఆపారని పోలీసులు చెబుతున్నారని లోకాయుక్తకు ఆ అధికారం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. ఆర్డర్ ఇవ్వకుండా ఆనందయ్యను ఆపడం వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని పిటిషనర్ పేర్కొన్నారు.



Tags

Next Story