రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్రంగా స్పందించిన ఏపీ హైకోర్టు

రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్రంగా స్పందించిన ఏపీ హైకోర్టు
ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి తీవ్రంగా స్పందించింది. హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేసింది. విజయవాడ గౌతమ్‌రెడ్డి..

ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి తీవ్రంగా స్పందించింది. హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేసింది. విజయవాడ గౌతమ్‌రెడ్డి, ఎల్లంటి లోచిని పిటిషన్స్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా... ఏపీలో పరిణామాలు గమణిస్తున్నామని ధర్మాసనం తెలిపింది. రాజ్యాంగ పరంగా పరిపాలన జరుగుతుందా లేదా... అనే అంశంపై విచారించి... కోర్టులు ఉత్తర్వులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. న్యాయపరమైన అవకాశాలను తమకు తెలియజేయాలని... పిటిషనర్ తరుఫు న్యాయవాది రవితేజను ఆదేశించింది.

రాజధానుల బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొంది... మండలిలో వ్యతిరేకిస్తే మండలి రద్దుకు సిఫారసు చేయడం మా దృష్టిలో ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. హెబియస్ కార్పస్ పిటిషన్లు పరిశీలిస్తున్నామని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై పోస్ట్‌ల విషయంలో రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు చేసినా సీరియస్‌గా తీసుకోకపోవడం గమనించామని హైకోర్టు పేర్కొంది. రాజ్యాంగం ప్రక్రియ ద్వారా పాలన జరుగుతుందా లేదా అనేది పరిశీలించాల్సి ఉందని స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story