కరోనా వ్యాప్తితో ఏపీ హైకోర్టు కీలక నోటిఫికేషన్ జారీ..!

కరోనా వ్యాప్తితో ఏపీ హైకోర్టు కీలక నోటిఫికేషన్ జారీ..!
హైకోర్టు పరిధిలో పనిచేసే అన్ని కోర్టు న్యాయమూర్తులు ప్రొటోకాల్‌ను తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఏపీలో రోజురోజుకు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో హైకోర్టు కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టు పరిధిలో పనిచేసే అన్ని కోర్టు న్యాయమూర్తులు ప్రొటోకాల్‌ను తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. సాక్షులు, కేసుల విచారణకు సంబంధించి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు వాయిదా వేయాలని సూచించింది. న్యాయమూర్తులు కేసుల విచారణను కోర్టు ఆవరణ నుంచి లేదా వారి నివాసాల నుండే చేపట్టవచ్చని సూచించింది. వ్యాజ్యాల నమోదుకు సంబంధించి ప్రస్తుతం ఉన్న పద్ధతి కొనసాగుతుందని వెల్లడించింది.

ఇక ఇవాళ్టి నుంచి ఏపీ హైకోర్టు, దాని పరిధిలో ఉన్న అన్ని కార్యాలయాల న్యాయమూర్తులు ఇంటి నుంచి.. లేదా కోర్టు హాల్ నుండి పనిచేస్తారని నోటిఫికేషన్‌లో పేర్కొంది. కోర్టు సెలవులు ఉంటే తప్ప కేసులు ఫైనల్ లిస్ట్ చేయవద్దని ఆదేశించింది. భౌతికంగా కేసులను తీసుకోవడం కొనసాగుతుందని.. కేసుకు సంబంధించిన పత్రాలను కోర్టు బయట ఉన్న బాక్సుల్లో ఉంచాలని హైకోర్టు రిజిస్ట్రార్ జరనల్ సూచించారు. హైకోర్టులోని ఫైలింగ్ విభాగంతో పాటు అన్ని విభాగాలు పూర్తిస్థాయిలో శానిటైజ్ చేయాలని ఆదేశించారు.

Tags

Next Story