రాజధాని తరలింపు అనుబంధ పిటిషన్లపై ఏపీ హైకోర్టు తీర్పు
రాజధాని తరలింపు అనుబంధ పిటిషన్లపై ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఇంప్లీడ్ అవుతామని దాఖలు చేసిన ఫిటిషన్లను ఉన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. విశాఖ గెస్ట్ హౌస్ ప్లాన్ తయారు చేశాక కోర్టులో దాఖలు చేయాలని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ కొనసాగిస్తోంది.
రాజధాని తరలింపు, క్యాంప్ ఆఫీస్, గెస్టు హౌజ్‌ల నిర్మాణాలపై హైకోర్టులో వానదలు కొనసాగుతున్నాయి. అమరావతి తరలింపు, క్యాంప్ ఆఫీస్ నిర్మాణాలకు సంబంధించిన ప్లాన్ ను సమర్పించవలసిందిగా కోర్టు ప్రభుత్వాన్ని కోరింది. అయితే వీటిపై ఇంతవరకు ప్లాన్ సిద్దంచేయలేని ప్రభుత్వం తరుపున న్యాయవాది కోర్టుదృష్టికి తీసుకొచ్చినట్లు హైకోర్టు న్యాయవాది రాజేంద్రప్రసాద్ తెలిపారు. అంతర్గత ఫిటీషన్ పై ఈ రోజు హైకోర్టులో వాదనలు కొనసాగాయని వెల్లడించారు. అయితే రాజధాని తరలింపుపై రాయలసీమ, ఉత్తరాంధ్రకు చెందిన కొందరువేసిన రిట్ ఫిటీషన్‌ను పరిశీలించిన కోర్టు వాటిని డిస్మిస్ చేసినట్లు తెలిపారు.
రాజధాని తరలింపులో భాగంగా చేపట్టే గెస్టు హౌజ్ నిర్మాణం, క్యాంప్ ఆఫీస్ ఏర్పాట్లను కోర్టు దృష్టికి తీసుకురావాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీటికి సంబంధించిన అంశాలను, ప్రభుత్వ రూపొందించిన నిర్మాణా ప్లాన్‌ను సమర్పించాలని వెల్లడించింది. ల్యాండ్ ఫూలింగ్, కేంద్ర నిధులు, రాజధానికి రైతులు ఇచ్చిన భూములపై హైకోర్టులోని మరో ధర్మాసనంలో వాదనలు జరిగాయి. రైతుల తరుపున న్యాయవాది కోర్టుకు తమ వాదనలు వినిపించారు. ఈ ధర్మాసనంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తోపాటు మరికొందరు సభ్యులుగా ఉన్నట్లు హైకోర్టు న్యాయవాది రాజేంద్రప్రసాద్ తెలిపారు. రాజధాని తరలింపుపై మూడు రోజులపాటు వాదనలు కొనసాగనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com