ఆర్థిక, గణాంకాల శాఖకు ఏపీ హైకోర్టు నోటీసులు

ఆర్థిక, గణాంకాల శాఖకు ఏపీ హైకోర్టు నోటీసులు

రాజధాని అమరావతిపై హైకోర్టులో వాదనలు వాడివేడిగా జరిగాయి. ఆర్థిక, గణాంకాల శాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 3 రాజధానుల నిర్ణయంతో జరిగిన ఆర్థిక నష్టం వివరాలు కోరుతూ.. రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ తర్వాత నోటీసులు జారీ చేసింది. మరికొన్ని పిటిషన్లపై హైకోర్టు సోమవారం వాదనలు విననుంది. రాజధాని వ్యాజ్యంలో రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్, స్టాటస్టిక్స్‌ను ప్రతివాదిగా చేర్చాలన్న అనుబంధ పిటిషన్లు విచారణకు అనుమతించింది. ఈమేరకు డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్, స్టాటస్టిక్స్‌కు నోటీసులు జారీ చేసింది. రాజధానితో ముడిపడిన ప్రధాన వ్యాజ్యాల్లోని అనుబంధ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. సీఎం క్యాంప్ ఆఫీస్ సహా ఇతర కేసులపైనా సోమవారం విచారణ జరపనుంది.

Tags

Read MoreRead Less
Next Story