ప్రభుత్వ స్థలం పేదలకు ఇవ్వాలన్న నిర్ణయంపై హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు

ప్రభుత్వ స్థలం పేదలకు ఇవ్వాలన్న నిర్ణయంపై హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు

విశాఖ జిల్లా కాపులుప్పాడులో ప్రభుత్వ స్థలాన్ని పేదలకు ఇవ్వాలన్న నిర్ణయంపై హైకోర్టు స్టేటస్‌ కో ఇచ్చింది. ఇటీవల కాపులుప్పాడులోని 20 ఎకరాలను పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆ స్థలమంతా బౌద్ధుని స్థూపం ఉన్న చారిత్రాత్మక ప్రదేశమని... పురావస్తు చట్టం, పర్యావరణ చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా ఇళ్ల స్థలాలు కేటాయించారని కొత్తపల్లి వెంకట రమణ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం.. స్టేటస్‌ కో ఆదేశాలు జారీ చేసింది.


Tags

Read MoreRead Less
Next Story