Vangalapudi Anitha : అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం కేసు..

Vangalapudi Anitha : అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం కేసు..
X
మీడియాకు వెల్లడించిన హోంశాఖ మంత్రి అనిత..

శ్రీ సత్యసాయి జిల్లాలో అత్తా కోడళ్లపై సామూహిక అత్యాచారం కేసు సంచలనం సృష్టించింది.. వలస వచ్చిన ఓ ఫ్యామిలీపై దాడి చేసిన దుండగులు.. అర్ధరాత్రి సమయంలో అత్తా కోడళ్లపై గ్యాంగ్‌ రేపు చేసిన ఘటన కలకలం సృష్టించగా.. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి.. ఘటన జరిగిన 48 గంటల్లోగా నిందితులను అరెస్ట్‌ చేశారు.. ఈ కేసుపై మీడియాతో మాట్లాడిన ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. సత్యసాయి జిల్లాల్లో అత్తా కోడళ్లపై అత్యాచారం చేసిన ఘటనలో 48 గంటల్లో నిందితులను పోలీసులు పట్టుకున్నారని తెలిపారు.. సీఎం చంద్రబాబు ఆదేశాలు మేరకు ఈ ఘటనలో నిందితులకు వేగంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నాం.. దీనిపై విచారణకు ప్రత్యేక కోర్టుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నాం అన్నారు.

ఇక, సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో ప్రజల భాగస్వామ్యం కూడా కోరుతున్నాం అన్నారు మంత్రి అనిత.. ఇళ్ల వద్ద వ్యాపార వాణిజ్య, సముదాయాల వద్ద పెట్టుకున్న సీసీ కెమెరాలను పోలీసు శాఖకు అనుసంధానం చేస్తే నేర నియంత్రణ సాధ్యం అవుతుందన్నారు.. పోలీసులకు ఆయుధాల్లాగే ప్రజలకు మొబైల్ ఫోన్లు కూడా ఉన్నాయి.. వాటిని వినియోగించి నేర నియంత్రణకు సహకరించాలన్నారు.. సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అందుకే సత్యసాయి జిల్లాలో జరిగిన అత్యాచార ఘటనలో అత్యంత వేగంగా విచారణ కోసం ప్రత్యేక కోర్టుకు కేసును అప్పగించాం అన్నారు.

ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేశాం.. దొరికిన ఐదుగురు నిందితుల్లో ఒకరిపై 37 కేసులు ఉన్నాయని.. 37 కేసులున్న వ్యక్తిపై అత్యాచార ఆరోపణలు కూడా ఉన్నాయన్నారు.. అందుకే త్వరితగతిన విచారణకు ప్రత్యేక కోర్టుకు అప్పగిస్తున్నాం అన్నారు హోంశాఖ మంత్రి అనిత.. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు హోంమంత్రి అనిత.. కాగా, రాష్ట్రంలో సంచలనం రేపిన సామూహిక ఆత్యాచార కేసులో నిందితులను అరెస్ట్ చేశారు.. ఈ నెల 12 అర్ధరాత్రి చిలమత్తూరు మండలంలో అత్తా కోడళ్లపై సామూహిక ఆత్యాచారం జరిగింది.. ఇప్పటి వరకు ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేయగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.. అయితే, నిందితుల్లో ముగ్గరు మైనర్లుగా పోలీసులు గుర్తించారు. బళ్లారి ప్రాంతం నుంచి ఉపాధి కోసం వచ్చిన కుటుంబంపై.. అర్ధరాత్రి సమయంలో బైక్ లపై వచ్చిన ఆరుగురు దుండగులు.. తండ్రి, కొడుకుపై దాడి చేసి.. అత్తా కోడళ్లపై అత్యాచారం చేశారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపగా.. సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. నిందితులను 48 గంటల్లోపు అరెస్ట్ చేసింది..

Tags

Next Story