AP: జగన్‌ ఎందుకు ఈ రాద్దాంతం

AP: జగన్‌ ఎందుకు ఈ రాద్దాంతం
X
వైసీపీ అధ్యక్షుడు జగన్ భద్రతను తాము తగ్గించలేదన్న హోంమంత్రి... 900 మంది సెక్యూరిటీ కావాలా అని హోంమంత్రి ప్రశ్న

వైసీపీ అధ్యక్షుడు జగన్ భద్రతను తాము తగ్గించలేదని.. భద్రత కుదించారంటూ ఆయన అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. సెక్యూరిటీ లేకపోతే ప్రజలు దాడి చేస్తారని జగన్ భయపడుతున్నారని అనిత ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 20 వేల మంది పోలీసుల కొరత ఉంటే ఆయనకు 900 మంది సెక్యూరిటీ కావాలా అని అనిత ప్రశ్నించారు. చంద్రబాబు ఎలాంటి తప్పు చేయకపోయినా 53 రోజులు జైలులో పెట్టారని గుర్తు చేశారు. స్నేహ బ్లాక్‌ వద్దకు వెళ్లాక భావోద్వేగానికి గురయ్యానని.. జైలులో ఖైదీల సౌకర్యాలు పరిశీలించానని అనిత తెలిపారు. క్షమాభిక్షపై ఖైదీల విడుదల ఆగస్టు 15కు ఉండదని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజున ఖైదీలు విడుదల ఉంటుందని అన్నారు. కొన్ని ఫైల్స్ పరిశీలించాల్సి ఉన్న కారణంగా కొంత సమయం ఆలస్యం అవుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. జగన్ సెక్యూరిటీని మేము తగ్గించలేదని, పులివెందుల ఎమ్మెల్యేకు నిబంధనల మేరకే భద్రత కొనసాగుతుందని అంటున్నారు.

చంద్రబాబు కీలక సూచనలు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వాసుపత్రులను దేశంలోనే బెస్ట్‌ హాస్పిటల్స్‌గా తీర్చిదిద్దాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖపై.. చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నకిలీ సదరం సర్టిఫికెట్లపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఫేక్ సదరం సర్టిఫికెట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంగవైకల్యంతో బాధపడేవారికి వివిధ రూపాల్లో పెన్షన్ అందిస్తున్నామని.. సదరం ఫేక్ సర్టిఫికేట్ల జారీపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అన్నారు. నకిలీ సదరం సర్టిఫికెట్ల గురించి పూర్తిస్థాయిలో సమాచారం సేకరించాలని చంద్రబాబు అన్నారు. పంచాయతీ రాజ్ శాఖతో సమన్వయం చేసుకుని ఫేక్ సదరం సర్టికెట్ల కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలోనే బెస్ట్ హాస్పిటళ్లుగా సర్కారు దవాఖానాలను తీర్చిదిద్దాలని చంద్రబాబు సూచించారు.

నకిలీ సదరం సర్టిఫికెట్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అంగవైకల్యం ఉన్నవారికి వివిధ రూపాల్లో పింఛన్లు ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. నకిలీ సదరం ధ్రువపత్రాల జారీపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాంటి ధ్రువపత్రాలపై పూర్తి సమాచారం సేకరించాలని.. పంచాయతీ రాజ్‌ శాఖ సమన్వయంతో నకిలీ పత్రాలు కట్టడి చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో పీపీపీ విధానంలో ఆస్పత్రి ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఆస్పత్రికి ప్రభుత్వమే స్థలం ఇస్తుందని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ, పీపీపీ ఆస్పత్రులను ఒకే గొడుగు కిందకు తెస్మన్నారు. ప్రభుత్వం తరఫున యాప్‌ రూపొందించాలని తెలిపారు.

Tags

Next Story