AP JAC : ఆయుధం మా చేతుల్లోనే ఉంది : జేఏసీ చైర్మన్ బొప్పరాజు

X
By - Vijayanand |8 March 2023 4:12 PM IST
పెండింగ్ బిల్లులను మూడు దశలుగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని .నిన్నటి చర్చల సారాంశాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలని సీఎస్ జవహర్ రెడ్డిని కోరామన్నారు
ఏపీ ఉద్యోగులు ప్రభుత్వం ట్రాపులో పడరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు.పెండింగ్ బిల్లులను మూడు దశలుగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని .నిన్నటి చర్చల సారాంశాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలని సీఎస్ జవహర్ రెడ్డిని కోరామన్నారు.
సాయంత్రంలోగా మినిట్స్ ఇస్తే.. రేపు ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ యధావిధిగా జరుగుతుందన్నారు. మినిట్స్ ఇచ్చిన తర్వాత కూడా పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆయుధం ఉద్యోగుల చేతుల్లోనే ఉందని. అజెండా నుంచి పక్కకు వెళ్లడం లేదని, ఎమ్మెల్సీ ఎన్నికలతో తమకు సంబంధం లేదన్నారు బొప్పరాజు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com