ఏపీ శాసనమండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం

ఏపీ శాసనమండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం

ఏపీ శాసనమండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మండలిలో మంత్రులు వాడిన భాష గురించి టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ను చెప్పుతో కొడతానంటూ మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యానించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రులతో కొట్టించుకోవడానికి మండలికి వస్తున్నామా అని మండిపడ్డారు. దీంతో రికార్డులు పరిశీలించి మంత్రులపై చర్యలు తీసుకుంటామని మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం తెలిపారు.

ఈ క్రమంలో ప్రతిపక్ష సభ్యులను కంట్రోల్ చేయకపోవడం సరికాదని మంత్రి బొత్స సత్యనారాయణ తెలపగా.. మంత్రులు మాట్లాడుకుంటూ పోతే చూస్తూ ఉండాలా అని డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం ప్రశ్నించారు. టీడీపీ సభ్యులు మాట్లాడేటప్పుడు అధికారపక్ష సభ్యులు రన్నింగ్ కామెంట్రీ చేయడంపై ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.

Tags

Read MoreRead Less
Next Story