ఏపీలో ముగిసిన తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు!

ఏపీలో ముగిసిన తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు!
X
ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. 13 జిల్లాల్లో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలిచారు.

ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. 13 జిల్లాల్లో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలిచారు. సాయంత్రం 4 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 7460 నామినేషన్ల దాఖలయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1156 నామినేష్లు దాఖలు కాగా ప్రకాశం జిల్లాలో అత్యల్పంగా 385 నామినేష్లు దాఖలు చేశారు. రాత్రి 7 గంటలకు నామినేష్లపై అధికారులు తుది వివరాలు వెల్లడించనున్నారు.

అటు పంచాయతీ బరిలో నిలిచేందుకు నేతలు పెద్ద సంఖ్యలో ముందుకొచ్చారు. బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రధాన పార్టీల నేతలు రంగంలోకి దిగారు. మూడు రోజుల పాటు నామినేషన్ల దాఖలు ప్రక్రియ సాగింది. తొలిరోజు మందకొడిగా నామినేష్లు దాఖలయ్యాయి. రెండో రోజయిన శనివారం మంచి రోజు అని భావించిన నేతలు పెద్ద సంఖ్యలో నామినేష్లు దాఖలు చేశారు. చివరి రోజు జోరుగా నామినేషన్లు వేశారు. పలుచోట్ల ఎస్‌ఈసీ నిబంధనల్ని అధికారులు ఉల్లంఘించారు.

పంచాయతీ నామినేషన్ల సందర్భంగా గ్రామాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. విపక్ష పార్టీల అభ్యర్థులపై అధికార వైసీపీ అరాచకాలకు పాల్పడింది. నామినేషన్లు వేసిన టీడీపీ మద్దతుదారులు, కుటుంబ సభ్యుల అరెస్ట్‌లు, కిడ్నాప్‌లతో పలుచోట్ల ఉద్రిక్తతలు తలెత్తాయి.

Tags

Next Story