ప్రభుత్వం ఈగోని తగ్గించుకోవాలి : సుప్రీంకోర్టు

ప్రభుత్వం ఈగోని తగ్గించుకోవాలి : సుప్రీంకోర్టు
ఉద్యోగులు పనిచేయకుండా పిటిషన్లు వేయడం ప్రమాదకరం : సుప్రీం

పంచాయతీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. దీంతో ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. యథావిధిగా ఎన్నికలు జరుగనున్నాయి. పంచాయతీ ఎన్నికలు వాయిదా కోరుతూ ఈ నెల 21నే ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇవాళ సుప్రీంలో వాదనలు కొనసాగాయి.

ప్రభుత్వంతోపాటు ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను కూడా సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఎన్నికల వాయిదా కుదరదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగడం లేదా అని కోర్టు ప్రశ్నించింది. ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో ఒక భాగమే అని వ్యాఖ్యానించింది.

షెడ్యూల్ ప్రకారమే ఏపీలో పంచాయతీ ఎన్నికలు - సుప్రీం

రాజ్యాంగ ఉల్లంఘనలను ఆమోదించబోమని స్పష్టం చేసిన సుప్రీం

ఈసీకి దురుద్దేశాలు ఆపాదించారు- సుప్రీంకోర్టు

ఎన్నికల వాయిదాకి సిల్లీ కారణాలు చూపిస్తున్నారు..

రిట్ పిటిషన్‌, SLPలో SECపై అనవసర వ్యాఖ్యలు చేశారు- సుప్రీం

ఉద్యోగుల ప్రవర్తన చూస్తుంటే.. రాష్ట్రంలో 'లాలెస్‌నెస్‌' కనిపిస్తోంది..

ఉద్యోగస్తులను అదుపులో ఉంచండి..

ప్రభుత్వం ఈగోని కొంచెం తగ్గించుకోవాలి- సుప్రీంకోర్టు

ఎన్నికల విషయంలో ఈగో క్లాష్ వచ్చిందని అర్థమవుతోంది- సుప్రీం

ఎన్నికల ప్రక్రియతో ఉద్యోగులకు ఏంపని- సుప్రీం

వ్యాక్సినేషన్‌ అసలు ఎన్నికల ప్రక్రియకు అడ్డు కానే కాదు- సుప్రీం

ఉద్యోగులు పనిచేయకుండా పిటిషన్లు వేయడం ప్రమాదకరం- సుప్రీం

ఎన్నికల ప్రక్రియలో ఉద్యోగులు ఇష్టారీతిన ఎలా వ్యవహరిస్తారు.. - సుప్రీం


Tags

Read MoreRead Less
Next Story