బిగ్ బ్రేకింగ్.. మంత్రి పేర్ని నానిపై దాడి

బిగ్ బ్రేకింగ్.. మంత్రి పేర్ని నానిపై దాడి

మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరిగింది. పేర్నినానిపై తాపీతో దాడి చేశాడో దుండగుడు. వెంటనే అప్రమత్తమైన మంత్రి అనుచరులు, సెక్యూరిటీ సిబ్బంది... నిందితున్ని పట్టుకున్నారు. దీంతో మంత్రి నానికి తృటిలో ప్రమాదం తప్పింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంత్రి నివాసంలోనే దాడికి యత్నం జరిగింది. మంత్రిపై దాడి ఘటన కృష్ణా జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేపింది.

నానిపై దాడి చేసిన వ్యక్తి చెమ్మన్నగిరికి చెందిన తాపీమేస్త్రీ బడుగు నాగేశ్వరరావుగా గుర్తించారు పోలీసులు. మద్యం మత్తులోనే ఈ దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతని నేర చరిత్రపై ఆరా తీస్తున్నారు. కాళ్లపై పడుతున్నట్లు వచ్చి తనపై రెండు సార్లు తాపీతో దాడి చేశారని మంత్రి నాని చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story