ఏపీ మంత్రి పేర్ని నాని ఇంట విషాదం..

ఏపీ మంత్రి పేర్ని నాని ఇంట విషాదం..

ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఇంట విషాదం నెలకొంది.. మంత్రి తల్లి నాగేశ్వరమ్మ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాగేశ్వరమ్మ కొద్ది రోజులు విజయవాడ లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందారు. రెండు రోజుల క్రితమే కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో గురువారం ఉదయం మరోసారి నాగేశ్వరమ్మ అస్వస్థతకు గురయ్యారు. దాంతో వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు.. అయితే నాగేశ్వరమ్మ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. మంత్రి తల్లి మరణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story