మున్సిపల్ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 32.23 శాతం పోలింగ్

ఏపీలో చెదురుమదురు ఘటనలు మినహా.. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. చాలా చోట్ల ఓటర్లు ఉదయం 6 గంటలకే పోలింగ్ బూత్‌లకు చేరుకున్నారు. నాలుగు గంటల్లో సుమారు 20శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 11 గంటల వరకు 32.23 శాతం పోలింగ్ నమోదైంది.
ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ విజయవాడలోని పోలింగ్ కేంద్రాల్ని పరిశీలించారు. పోలింగ్ సరళి.. ఏర్పాట్ల గురించి అధికారుల్ని ఆరా తీశారు. యువత ఓటింగ్ చైతన్యం ప్రదర్శించాలని అన్నారు. ఓటర్లతోనూ మాట్లాడారు. ఓటరు స్లిప్పు లేకపోయినా సరైన గుర్తింపు పత్రం చూపించి అందరూ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. తీవ్ర ఉత్కంఠ రేపిన పుర సమరంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా చూసేందుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com