బ్రేకింగ్.. ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

బ్రేకింగ్.. ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల
31వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు విధించారు. ఫిబ్రవరి 5న పోలింగ్‌ జరగనుంది.

ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది ఎస్‌ఈసీ. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను నిమ్మగడ్డ రమేశ్ విడుదల చేశారు. విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహా అన్ని చోట్ల ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు నిమ్మగడ్డ రమేష్‌. ఈ నెల 25 నుంచి అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. 27వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఉంటుందని చెప్పారు. 28న నామినేషన్ల పరిశీలన జరనుంది. 29న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలించనున్నారు. 30న ఆ అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. 31వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు విధించారు. ఫిబ్రవరి 5న పోలింగ్‌ జరగనుంది.

Tags

Read MoreRead Less
Next Story