ఉద్యోగుల ప్రవర్తన చూస్తుంటే.. ఏపీలో 'లాలెస్‌నెస్‌' కనిపిస్తోంది : సుప్రీం కోర్టు

ఉద్యోగుల ప్రవర్తన చూస్తుంటే.. ఏపీలో లాలెస్‌నెస్‌ కనిపిస్తోంది : సుప్రీం కోర్టు
విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. పంచాయతీ ఎన్నికలు వాయిదా కోరుతూ ఈ నెల 21నే ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇవాళ సుప్రీంలో వాదనలు కొనసాగాయి. ప్రభుత్వంతోపాటు ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను కూడా సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఎన్నికల వాయిదా కుదరదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

ఎన్నికల వాయిదాకు సిల్లీ కారణాలు చూపుతున్నారని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. SLP రిట్ పిటీషన్‌లో SECపై అనవసర వ్యాఖ్యలు చేశారని.. అలా చేయడం సరికాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. SEC అనేది రాజ్యాంగబద్ద సంస్థ అని చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగస్తులు బాధ్యతారాహితంగా వ్యవహరిస్తున్నారని సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగుల ప్రవర్తన చూస్తుంటే రాష్ట్రంలో చట్టం అమలు కావడం లేదనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ఉద్యోగులను అదుపులో ఉంచండి అని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఎన్నికలు నిర్వహించేందుకు ప్రాబ్లం ఏంటని కోర్టు ప్రశ్నించింది.

ఎన్నికల విషయంలో ఇగో క్లాష్ వచ్చిందని అర్థమవుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం ఇగోని కొంచెం తగ్గించుకోవాలని కోర్టు సూచించింది. షెడ్యూల్ ప్రకారమే ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎన్నికల కమిషన్ తరఫున రంజిత్ కుమార్, ఆదినారాయణ, అశ్విన్ కుమార్‌లు వాదనలు వినిపించారు. ఇక ప్రభుత్వం తరఫున ముకుల్ రోహిత్గీ వాదించారు.

Tags

Next Story