గుంటూరు, చిత్తూరు జిల్లాల ఏకగ్రీవాలను ప్రకటించొద్దంటూ..ఎస్‌ఈసీ ఆదేశాలు

గుంటూరు, చిత్తూరు జిల్లాల ఏకగ్రీవాలను ప్రకటించొద్దంటూ..ఎస్‌ఈసీ ఆదేశాలు
గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు ఎస్‌ఈసీ.

ఏపీ పంచాయతీల్లో ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ గట్టి నిఘా పెట్టారు. ఇందులో భాగంగా గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించొద్దని సూచించారు. ఫిర్యాదులు పరిష్కరించాకే ఏకగ్రీవాలు ప్రకటించాలని ఆదేశించారు. ఫిర్యాదులపై నివేదిక పంపాలని కలెక్టర్లకు సూచించారు. లోపాలు ఉన్నట్లు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు జరిగినట్లు ఎస్‌ఈసీ గుర్తించారు.

Tags

Next Story