13 Feb 2021 5:45 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / గుంటూరు జిల్లాలో...

గుంటూరు జిల్లాలో బ్యాలెట్ పత్రాలను ఎత్తుకెళ్లిన దుండగులు

ఎన్నికల సిబ్బంది రాత్రి భోజనం చేస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు బ్యాలెట్ పత్రాలను అపహరించినట్లు తెలిసింది.

గుంటూరు జిల్లాలో బ్యాలెట్ పత్రాలను ఎత్తుకెళ్లిన దుండగులు
X

గుంటూరు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఉపయోగించాల్సిన బ్యాలెట్ పత్రాలు అపహరణకు గురయ్యాయి. వినుగొండ మండలం నడిగడ్డ పంచాయతీలోని బ్యాలెట్ పత్రాలను దుండుగులు ఎత్తుకెళ్లారు. ఎన్నికల సిబ్బంది రాత్రి భోజనం చేస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు వాటిని అపహరించినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని జిల్లా స్థాయి అధికారులకు సమాచారం ఇచ్చి పోలింగ్‌కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది.


Next Story