Home
 / 
ఆంధ్రప్రదేశ్ / నేటి నుంచి పంచాయతీ...

నేటి నుంచి పంచాయతీ ఎన్నికల మూడో దశ నామినేషన్ల స్వీకరణ

ఫిబ్రవరి 8న నామినేషన్ల దాఖలుకు తుది గడువు కాగా.. ఫిబ్రవరి 9న నామినేషన్లను అధికారులు పరిశీలించానున్నారు.

నేటి నుంచి పంచాయతీ ఎన్నికల మూడో దశ నామినేషన్ల స్వీకరణ
X

నేటి నుంచి పంచాయతీ ఎన్నికల మూడో దశ నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 8న నామినేషన్ల దాఖలుకు తుది గడువు కాగా.. ఫిబ్రవరి 9న నామినేషన్లను అధికారులు పరిశీలించానున్నారు. ఇక ఫిబ్రవరి 10వ తేదీని నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి.. ఫిబ్రవరి 11న అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఫిబ్రవరి 12న నామినేషన్లు ఉపసంహరణ జరగనుంది. ఫిబ్రవరి 17వ తేది ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుండగా... సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక చేపట్టనున్నారు.

13 జిల్లాల్లోని 19 రెవెన్యూ డివిజన్లలో మూడవ విడత ఎన్నికలు జరగనున్నాయి. శ్రీకాకుళం, పాలకొండ, విజయనగరం, పాడేరు, రంపచోడవరం, ఏటపాక, జంగారెడ్డి గూడెం, కుక్కునూరు, మచిలీపట్నం, గురజాల, కందుకూరు, గూడురు, నాయుడుపేట, ఆదోని, కర్నూలు, అనంతపురం, మదనపల్లి, రాజంపేట, కడప డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి.


Next Story