హైకోర్టులో ఎస్ఈసీ కోర్టు ధిక్కార పిటిషన్

హైకోర్టులో ఎస్ఈసీ కోర్టు ధిక్కార పిటిషన్
కోర్టు ధిక్కార పిటిషన్ లో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ను ప్రతివాదిగా చేర్చడానికి హైకోర్టు అనుమతించింది.

ఎస్ఈసీ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్ లో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ను ప్రతివాదిగా చేర్చడానికి హైకోర్టు అనుమతించింది. ఎస్ఈసీకి సహకరించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం పాటించడం లేదని గత నవంబర్ 3న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు.

మాజీ సీఎస్ నీలం సాహ్నీ, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పేర్లను ఈ పిటిషన్ లో చేర్చారు. ఈ పిటిషన్ పై శుక్రవారం జస్టిస్ బట్టు దేవానంద్ విచారణ జరిపారు.

ఎస్ఈసీకి సహకారం అందించాలని కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఇంకా అమలు కాలేదని.. ఈ నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ను ప్రతివాదిగా చేర్చేందుకు అనుమతివ్వాలని కోరారు. ఇందుకు అనుమతిచ్చిన హైకోర్టు.. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.


Tags

Read MoreRead Less
Next Story