AP Police : ఫోన్ ల రికవరీలో అనంతపురం ఫస్ట్

8.25కోట్ల విలువైన సెల్ ఫోన్లను రికవరీ చేసినట్లు అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. దాదాపు 5వేలకు పైగా ఫోన్లు రికవరీ అయ్యాయని అన్నారు. దేశంలోని 15 రాష్ట్రాలతో పాటు, ఆంధ్రాలోని 18జిల్లాల ప్రజలు పోగొట్టుకున్న సెల్ ఫోన్ లను అందజేయడం సంతోషంగా ఉందని చెప్పారు. ఫోన్లను పోగొట్టుకున్న వారు పోలీస్టేషన్ కు వెళ్లకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం లేకుండా వాట్సప్ నెంబర్ కు ఫిర్యాదు చేస్తే చాలని ఎస్పీ తెలిపారు. మార్చి 17న 9440796812 అనే వాట్సప్ నెంబర్ ను ప్రవేశపెట్టామని చెప్పారు. జూన్ 26న 'చాట్ బాట్' సేవలను ప్రారంభించినట్లు తెలిపారు.
అనంతపురం వెలుపల ఉన్న ప్రజల ఫోన్లను రికవరీ చేశాక 'ఫ్రీ డోర్ డెలివరీ' చేస్తున్నట్లు ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. ఒక ప్రొఫెషనల్ కొరియర్ సహాయంతో డోర్ డెలివరీ సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. 'చాట్ బాట్' సేవలను ప్రారంభించిన స్వల్ప వ్యవధిలో ఇప్పటివరకు 8.25కోట్ల విలువైన 5077ఫోన్లు రికవరీ అయినట్లు తెలిపారు. మొబైల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే అనంతపురం ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఎస్పీ ఫకీరప్ప మంగళవారం 700ఫోన్లను అందజేయగా మిగిలిన ఫోన్లను పోలీసులు ఇప్పటికే అందజేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com